ముంబై
పోర్ట్ ట్రస్ట్.. 2016-17లో గ్రాడ్యుయేట్ టెక్నీషియన్, ట్రేడ్
అప్రెంటీసెస్‌లకు శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. శిక్షణ
వ్యవధి ఏడాది.

- గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్-2
- గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-3
- డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్-3
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-3
- ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పీఏఎస్‌ఏఏ)-248
విద్యార్హత:
- గ్రాడ్యుయేట్: మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ
- డిప్లొమా: మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా
- పీఏఎస్‌ఏఏ: పదో తరగతి ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ)లో ఐటీఐ.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుం: ‘ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ది పోర్ట్ ఆఫ్ ముంబై’ పేరిట రూ.20 పోస్టల్ ఆర్డర్/డీడీ/బ్యాంకర్స్ చెక్/పే ఆర్డర్ తీయాలి.
దరఖాస్తు విధానం: సంస్థ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తును పూర్తి చేసి; విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను, దరఖాస్తు రుసుం రశీదును జత చేసి కింది అడ్రస్‌కు పంపాలి.
చిరునామా: అప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఎంబీపీటీ వర్క్‌షాప్, మజ్‌గావ్ (ఈస్ట్), ముంబై, 400010.
ముఖ్య తేదీలు:
- దరఖాస్తులు పంపేందుకు చివరి తేది: 2017 జనవరి 20
- మెరిట్ లిస్ట్‌లు ప్రకటించే తేదీలు: 2017 ఫిబ్రవరి 8, 9, 11, 12, 14, 15
వెబ్‌సైట్: mumbaiport.gov.in
No comments:
Post a Comment