రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* అసిస్టెంట్: 623 పోస్టులు శాఖల వారీగా ఖాళీలు: హైదరాబాద్-16, అహ్మదాబాద్-19, బెంగళూరు-25, భోపాల్-25, భువనేశ్వర్-17, చండీగఢ్-13, చెన్నై-15, గువాహటి-36, జైపూర్-13, జమ్మూ-23, కాన్పూర్ & లక్నో- 44, కోల్‌కతా-23, ముంబయి-264, నాగ్‌పూర్-15, న్యూదిల్లీ-47, పాట్నా-15, తిరువనంతపురం & కోచి- 13. విద్యార్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణులైతే చాలు.వయసు: 01.10.2017 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.10.1989 - 01.10.1997 మధ్య జన్మించి ఉండాలి.దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.450 ( పరీక్ష ఫీజు + లిమిటేషన్ చార్జీలు); ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు రూ.50 (లిమిటేషన్ చార్జీలు).దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు; లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా.పరీక్ష విధానం: 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష, 200 మార్కులకు మెయిన్ పరీక్ష, ఆన్‌లైన్ పరీక్షల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ మినహా మిగతా సబ్జెక్టులన్నీ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటాయి.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2017.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.11.2017.దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 25.11.2017.ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: 27, 28.11.2017.ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేది: 20.12.2017.
No comments:
Post a Comment