Friday, January 27, 2017
Wednesday, January 25, 2017
Tuesday, January 24, 2017
తెలంగాణా లో ఐదు జిల్లాల పేర్లు మార్పు .................?
తెలంగాణా జిల్లాల పేర్ల మార్పు :
కొత్త జిల్లాలతో ఏర్పాటు అయిన తెలంగాణా 31 జిల్లాలలో కొత్తగాఏర్పడిన 5 జిల్లాల పేర్లకు సంభందించిన మార్పునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గా , గద్వాల జిల్లాను జోగులంభ గద్వాల జిల్లా గా , యదాద్రి జిల్లాను యదాద్రి భువనగిరి జిల్లా గా కొమురం భీం జిల్లా ను కుమురం భీం జిల్లా గా మరియు రాజన్న జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాగా పేర్లు మార్చారు.
కొత్త జిల్లాలతో ఏర్పాటు అయిన తెలంగాణా 31 జిల్లాలలో కొత్తగాఏర్పడిన 5 జిల్లాల పేర్లకు సంభందించిన మార్పునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గా , గద్వాల జిల్లాను జోగులంభ గద్వాల జిల్లా గా , యదాద్రి జిల్లాను యదాద్రి భువనగిరి జిల్లా గా కొమురం భీం జిల్లా ను కుమురం భీం జిల్లా గా మరియు రాజన్న జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాగా పేర్లు మార్చారు.
*****
Saturday, January 21, 2017
Thursday, January 19, 2017
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో 201 పీవో పోస్టులు
సౌత్ ఇండియన్ బ్యాంక్.. స్కేల్-1 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

విద్యార్హత(2016 డిసెంబర్ 31 నాటికి): పదో తరగతి నుంచి డిగ్రీ వరకు 60 శాతానికి పైగా మార్కులు ఉండాలి.
వయసు(2016 డిసెంబర్ 31 నాటికి): 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ప్రభుత్వ/ప్రైవేట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో క్లర్క్/ ఆఫీసర్ స్థాయిలో కనీసం రెండేళ్ల అనుభవం గల వారికి గరిష్ట వయో పరిమితిలో మూడేళ్ల సడలింపు ఇస్తారు.
ప్రొబేషన్ వ్యవధి: రెండేళ్లు
పోస్టింగ్ ప్రదేశం: జోనల్ ప్రాతిపదికన నియమిస్తారు.
విధులు: బ్రాంచ్ బ్యాంకింగ్, క్రెడిట్, బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఫారెక్స్, ట్రెజరీ తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇందులో మూడు దశలు (ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ) ఉంటాయి. తుది ఎంపిక పర్సనల్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగానే జరుగుతుంది.
రాత పరీక్ష: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు (200 మార్కులు) జవాబులు గుర్తించాలి. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యత) నుంచి 50, రీజనింగ్ నుంచి 40, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 40, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులు రూ.700; ఎస్సీ, ఎస్టీలు రూ.150 చెల్లించాలి.
ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 27, 2017
- ఆన్‌లైన్ టెస్ట్ ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: www.southindianbank.com
Monday, January 16, 2017
Friday, January 13, 2017
Saturday, January 7, 2017
స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 252 పోస్టులు
స్టాఫ్
సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ) వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ
మంత్రిత్వ శాఖలు /విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్)
స్టాఫ్ నియామకానికి ప్రకటన జారీ చేసింది.
![]() ఆంధ్రప్రదేశ్ : 125 (ఓసీ-58, ఓబీసీ-48, ఎస్సీ-7, ఎస్టీ-12). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-7, పీడబ్ల్యూడీ-3. తెలంగాణ : 127 (ఓసీ-66, ఓబీసీ-34, ఎస్సీ-11, ఎస్టీ-16). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-7, పీడబ్ల్యూడీ-2. వేతనం: రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.1800. విద్యార్హత: 2017 ఆగస్టు 1 నాటికి పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. వయసు: 2017 ఆగస్టు 1 నాటికి 18-25 ఏళ్లు. రిజర్వేషన్, ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, పేపర్-2లో డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. పేపర్-1: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో 150 ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు; జనరల్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు; జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పేపర్-1లో ఉత్తీర్ణులైనవారినే పేపర్-2కి అనుమతిస్తారు. పేపర్-2: ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్ధ గంట (30 నిమిషాల) వ్యవధిలో షార్ట్ ఎస్సే/లెటర్ రాయాలి. లెటర్‌ను ఏ భాషలోనైనా రాయొచ్చు. ఈ పరీక్షకు 50 మార్కులు కేటాయించారు. తుది ఎంపిక: పేపర్-2లోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థుల పేపర్-1 మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం: రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 30 సాయంత్రం 5 గంటలు. పరీక్ష తేదీలు: ఏప్రిల్ 16, 30; మే 7 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: ssconline.nic.in |
![]() |
Sunday, January 1, 2017
Subscribe to:
Posts (Atom)