సౌత్ ఇండియన్ బ్యాంక్.. స్కేల్-1 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

విద్యార్హత(2016 డిసెంబర్ 31 నాటికి): పదో తరగతి నుంచి డిగ్రీ వరకు 60 శాతానికి పైగా మార్కులు ఉండాలి.
వయసు(2016 డిసెంబర్ 31 నాటికి): 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ప్రభుత్వ/ప్రైవేట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో క్లర్క్/ ఆఫీసర్ స్థాయిలో కనీసం రెండేళ్ల అనుభవం గల వారికి గరిష్ట వయో పరిమితిలో మూడేళ్ల సడలింపు ఇస్తారు.
ప్రొబేషన్ వ్యవధి: రెండేళ్లు
పోస్టింగ్ ప్రదేశం: జోనల్ ప్రాతిపదికన నియమిస్తారు.
విధులు: బ్రాంచ్ బ్యాంకింగ్, క్రెడిట్, బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఫారెక్స్, ట్రెజరీ తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇందులో మూడు దశలు (ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ) ఉంటాయి. తుది ఎంపిక పర్సనల్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగానే జరుగుతుంది.
రాత పరీక్ష: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు (200 మార్కులు) జవాబులు గుర్తించాలి. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యత) నుంచి 50, రీజనింగ్ నుంచి 40, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 40, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులు రూ.700; ఎస్సీ, ఎస్టీలు రూ.150 చెల్లించాలి.
ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 27, 2017
- ఆన్‌లైన్ టెస్ట్ ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: www.southindianbank.com
No comments:
Post a Comment